ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ హైప్ తో ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గరే అత్యంత కాస్ట్లీ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె దిశా పటాని లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ తారాగణం నటిస్తున్నారు.
ఇక మొన్ననే ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో యాడ్ కాగా ఈ చిత్రం కోసం మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రం విషయంలో బహుశా రిలీజ్ ఈ జనవరి కి ఉండదు అనే ఓ రూమర్ అయితే వైరల్ గా మారగా అది ఆల్ మోస్ట్ నిజం అన్నట్టు అయ్యింది.
ఇక ఈ చిత్రం పై లేటెస్ట్ గా మరో క్రేజీ బజ్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. ప్రాజెక్ట్ కే రిలీజ్ ఆగిపోలేదని వెరీ మచ్ గా జనవరి లో తీసుకొచ్చేందుకే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సాలిడ్ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ చిత్రం రిలీజ్ ఆన్ టైం ఉండబోతుంది అని చెప్పొచ్చు. మరి దీనిపై మరోసారి ఏమన్నా అధికారిక క్లారిటీ వస్తే సరిపోతుంది.
మొన్న కమల్ అప్డేట్ లో అయితే రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చెయ్యలేదు ఇక నెక్స్ట్ అప్డేట్ లో ఏమన్నా చెప్తే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. కాగా ఈ భారీ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సి అశ్వనీదత్ ఈ చిత్రానికి మాసివ్ బడ్జెట్ పెట్టి నిర్మాణం వహిస్తున్నారు.