రామ్ ” రెడ్ ” సినిమా దసరా అప్‌డేట్ అదిరిపోయింది.. ఎవరూ ఊహించలేదు..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో రామ్. ఊర మాస్ క్యారెక్టర్ లో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పట్లో తగ్గేది కాదు. అందుకే మరోసారి అలాంటి మాస్ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే రెడ్ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు.

Image

ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. నివేతా పెతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే రిలీజైన ఐటం సాంగ్ లో యంగ్ బ్యూటి హెబ్బా పటేల్ ఆకట్టుకుంది. ఇక స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

కాగా దసరా పండగ సందర్భంగా హీరో రామ్ ” రెడ్ ” సినిమా నుంచి రెండు విభిన్నమైన గెటప్పులతో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసి పండుగ విషెస్ తెలుపుతు ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా థియోటర్స్ లోనే రిలీజ్ అవుతుందన్న క్లారిటీ ఇస్తూ సంక్రాంతి పండగ సందర్భా రిలీజ్ అవుతున్నట్టు వెల్లడించాడు. కాగా ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా తడం కి అఫిషియల్ రీమేక్ గా రూపొందింది.