“రాధే శ్యామ్” నుంచి లేటెస్ట్ అప్‌డేట్.. ప్రభాస్ బర్త్ డే కి వచ్చే సర్‌ప్రైజ్ ఇదే ..!

ప్రభాస్ నుంచి బాహుబలి ఫ్రాంఛైజీ, సాహో లాంటి బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తర్వాత కంప్లీట్ లవ్ స్టోరీ గా వస్తున్న సినిమా “రాధే శ్యామ్”. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ లవ్ స్టోరీగా జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద దేశంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఉన్న ఆతృత అంతా ఇంతా కాదు.

Pooja Hegde is Prerana in Prabhas' Radhe Shyam | Entertainment News,The  Indian Express

“రాధే శ్యామ్” సినిమా మొదలైనప్పటి నుంచే ఫ్యాన్స్ తృప్తి పడే ఏ ఒక్క అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో టైటిల్ తో పాటు ప్రభాస్ – పూజ హెగ్డే ల ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిచ్చారు. ఇక రీసెంట్ గా పూజా హెగ్డే బర్త్ డే రోజున ప్రేరణ గా నటిస్తున్న పూజా హెగ్డే లుక్ ని రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

కాగా తాజాగా డార్లింగ్ ప్రభాస్ స్వయంగా ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్‌డేట్ ను ఇచ్చాడు. ఈ అక్టోబర్ 23న టీజర్ వస్తుంది అంటూ అద్భుతమైన వింటేజ్ పోస్టర్ తో ప్రకటించి ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అలాగే ఇదే టీజర్ తో పాటు “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” ను కూడా పరిచయం చేస్తున్నట్టు అఫీషియల్ గా వెల్లడించాడు డార్లింగ్.

Image

దీంతో బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలో క్యూరియాసిటీ మొదలైంది. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం రకారం మ్యూజిక్ పరంగా రాధే శ్యామ్ సర్ప్రైస్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రభాస్ స్వయంగా ఈ అప్‌డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయంటున్నారు.