కిరాక్ పుట్టిస్తున్న మాస్ మహారాజా క్రాక్ పోస్టర్ ..!

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందున్న తాజా చిత్రం క్రాక్. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రవితేజ – శృతిహాసన్ ల పోస్టర్ కిరాక్ పుట్టిస్తోది. మాస్ రాజా కి ఈసారి బ్లాక్ బస్టర్ మిస్ అవదన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

Image

రవితేజ నుంచి మాస్ ఆడియన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నట్టు ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తుంటే క్లారిటీ వచ్చేసింది. గత కొంతకాలంగా వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ కి క్రాక్ సాలీడ్ హిట్ ఇవ్వబోతుంది చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ పెద్ద ఎసెట్ అని చిత్ర యూనిట్ చెప్పుకుంటున్నారు.

కాగా ఒంగోలులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా క్రాక్ రూపొందుతుండగా రవితేజ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ .. సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడి అన్న సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా అధికారకంగా ప్రకటించాడు.