లేటెస్ట్ : టాలీవుడ్ లో టోటల్ షూటింగ్స్ బంద్.!

జస్ట్ గడిచిన ఈ కొన్ని నెలలు వారాల వ్యవధి లోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరు సీనియర్ నటులు అయితేనేమి దర్శకులు అయితేనేమి కాలం చెల్లించడంతో కన్నుమూయడం తీరని విషాదాలుగా నిలిచాయి.

మరి కైకాల సత్యన్నారాయణ, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు ఇటీవల సీనియర్ నటి జమున గారు లాంటి దిగ్గజాలు కన్ను మూయడంతో అలనాటి తారల శకం ముగిసింది. అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో గర్వించదగ్గ దిగ్గజ సీనియర్ దర్శకులు కే విశ్వనాధ్ గారు మరణించడం అనేది తెలుగు సినిమా దగ్గర ఒక్కసారిగా స్తంభింపజేసేలా చేసింది.

వారి మరణ వార్త తెలుగు సహా తమిళ సినీ వర్గాల్లో పెద్ద లోటు కాగా ఆయనతో వర్క్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఉలగనయగన్ కమల్ హాసన్ లు ఎంతో మనస్తాపానికి లోనయ్యారు. దీనితో తాజాగా తెలుగు సినిమా అంతా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈరోజు వారి మరణానికి నివాళిగా ఏ సినిమా షూటింగ్ కూడా ఈరోజు జరుపకూడదు అని నిర్ణయించుకొని.

ఈరోజుకి గాను అన్ని సినిమాల షూటింగ్ లు బంద్ చేసి ఆ మహనీయుడని నివాళిగా అర్పించాలని నిర్ణయించుకున్నట్లుగా ఇప్పుడు సినీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం. ఏది ఏమైనప్పటికీ మాత్రం వారు లేని లోటు ఎవరూ తీర్చనటువంటిది ప్రస్తుతం అనేకమంది సినీ ప్రముఖులు ఆయన పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.