రాసి పెట్టుకోండి ఈ అప్డేట్ ప్రభాస్ సినిమాపైనే.!

Prabhas-embarrassment-moment-again-in-limelight

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పలు భారీ చిత్రాలతో యమా బిజీగా ఉన్నాడు. మరి ఈ చిత్రాల్లో అయితే ఇంకా అనధికారికంగా చేస్తున్న సినిమా కూడా ఉంది. ఆ సినిమానే దర్శకుడు మారుతీ తో ప్లాన్ చేసిన సినిమా అని చెప్పాలి. మరి ఈ సినిమా అయితే ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసుకుంది కానీ ఇంకా అధికారికంగా అయితే అనౌన్స్ కాలేదు.

కానీ కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా పై మరిన్ని వార్తలు బయటకి రావడం పైగా సినిమా నుంచి ప్రభాస్ లుక్ కూడా బయటకొచ్చి పెద్ద ఎత్తున వైరల్ కాగా ఇప్పుడు ఈ సినిమాపై అధికారిక అనౌన్సమెంట్ రాబోతోందా అంటే అవుననే ఇప్పుడు సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా వర్గాల్లో ఓ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ అయితే రేపు మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మరి ఈ అప్డేట్ అయితే డెఫినెట్ గా ప్రభాస్ మారుతీ సినిమాపైనే అని గట్టిగా ఉన్న సమాచారం. రాసి పెట్టుకోండి రేపు ఖచ్చితంగా వచ్చే ఈ అప్డేట్ వారి కాంబినేషన్ కోసమే అని వస్తుంది.

మరి ఈ చిత్రాన్ని లేటెస్ట్ భారీ హిట్ “ధమాకా” నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే తెరకెక్కిస్తున్నారు. పైగా వారు కూడా ఇదే ట్వీట్ చేశారు. దీనితో రేపు వచ్చే ఆ అప్డేట్ ప్రభాస్ మారుతీ సినిమా కోసమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. జస్ట్ ఆ టైం వరకు ఇక ఆగితే సరిపోతుంది.