లేటెస్ట్ : గుడ్ న్యూస్ తో ఇలియానా..అప్పుడే బిడ్డకి పేరు కూడా.!

ఒకప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది యంగ్ హీరోయిన్ ఇలియానా అని చెప్పాలి. మరి అప్పటివరకు హీరోయిన్స్ లో ఓ ట్రెండ్ నడుస్తూ వచ్చిన టైం లో వచ్చిన ఈ యంగ్ బ్యూటీ కెరీర్ స్టార్ట్ అయిన రెండు సినిమాలతోనే ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తో రికార్డు సెట్ చేసింది.

దీనితో ఒక్కసారిగా ఇండియన్ సినిమా దగ్గర ఇలియానా పేరు హాట్ టాపిక్ గా మారగా టాలీవుడ్ లో ఫస్ట్ 1 కోటి రెమ్యునరేషన్ హీరోయిన్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది. ఇక అప్పుడు నుంచి ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు గ్యాప్ ఇవ్వగా గత కొన్నాళ్ల కితమే తాను తల్లి కాబోతున్నట్టుగా షాకింగ్ న్యూస్ షేర్ చేసింది.

కాగా తనకి ఇంకా పెళ్లి కాలేదు కదా ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంతా షాక్ అయ్యారు. అయితే ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉండగా ఇదంతా అలా జరిగింది అని తెలిసింది. అయితే ఈరోజు మాత్రం ఫైనల్ గా ఓ గుడ్ న్యూస్ ని ఇలియానా షేర్ చేసింది.

తాను పండంటి మగ బిడ్డకు ఈ ఆగస్ట్ 1న జన్మనిచ్చినట్టుగా కన్ఫర్మ్ చేసింది. అంతే కాకుండా తన బాబుకి పేరు కూడా అప్పుడే పెట్టేసింది. కోఆ పీనిక్స్ డోలాన్ అనే ఇంగ్లీష్ పేరుని అయితే ఆమె పెట్టింది. దీనితో ఈ న్యూస్ సహా పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారగా సినీ ప్రముఖులు ఇలియానాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.