ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” రిలీజ్ పై కొత్త గాసిప్స్.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ హ్యాపీ మూడ్ లో ఉన్నారని చెప్పొచ్చు. సినిమాలు పెద్దగా రాణించలేకపోయినా అలాగే సినిమాల అప్డేట్స్ కూడా లేకపోయినప్పటికీ నిన్న బాలయ్య షో అన్ స్టాప్పబుల్ నుంచి వచ్చిన ప్రోమోతో మాత్రం మంచి ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈ ఎంజాయ్మెంట్ లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ లేటెస్ట్ గాసిప్ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కగా రామునిగా ప్రభాస్ జానకి దేవిగా కృతి సనన్ లు నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రాన్ని మొదట జనవరి రిలీజ్ ప్లాన్ చేయగా టీజర్ చూసిన తర్వాత ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో అయితే మేకర్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక దీనితో చేసేది లేక వారు సినిమాని జూన్ కి వాయిదా చేశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గాసిప్ ఏమిటంటే ఈ చిత్రం జూన్ కి కూడా వచ్చే అవకాశం లేదట.

దీనితో మరోమారు ఆదిపురుష్ వాయిదా పడినట్టే అని కొన్ని ట్రస్టడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఇక ఈ చిత్రం ఈ ఏడాదే వస్తుందా లేక వచ్చే ఏడాదికి మారిందా అనేది కాలమే డిసైడ్ చెయ్యాలి.