బిగ్ అప్డేట్ : ఇంగ్లీష్ లో ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్ పై సెన్సేషనల్ క్లారిటీ.!

ఇప్పుడు మన తెలుగు సినిమాలు సహా తెలుగు హీరోలు కూడా ప్రపంచ స్థాయిలో ఎంత గుర్తింపు తెచుకుంటున్నారో తెలిసిందే. అయితే ఈ లిస్ట్ లో ఇప్పుడున్న హీరోస్ లో అయితే మొదటగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉంటాడని చెప్పాలి. ప్రభాస్ హీరోగా ఇప్పుడు ఏ సినిమా చేసినా అది ఒక పాన్ ఇండియా సినిమా అంతే.. 

అలా ఇప్పుడు తన లైనప్ లో ఎన్నో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లను ప్రభాస్ సెట్ చేసుకోగా వాటిలో యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కె” మొదటి సారిగా వరల్డ్ లెవెల్ సినిమాగా అనౌన్స్ చేశారు. కానీ దాని కన్నా ముందు హాలీవుడ్ లో ఇంగ్లీష్ భాషలో డబ్ అయ్యి రిలీజ్ కి సిద్ధం అవుతున్న చిత్రం మాత్రం “ఆదిపురుష్” అని ఒక బిగ్ అప్డేట్ తో సెన్సేషనల్ క్లారిటీ బయటకి వచ్చింది. 

దీనిని ఎవరో కాదు ప్రభాస్ పెదనాన్న టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు నే తెలియజేయడం విశేషం. నాకు కూడా నిన్ననే తెలిసిందే ప్రభాస్ ని ఇంగ్లీష్ లో పరిచయం చేసే ప్లాన్ జరుగుతుంది అది ఆదిపురుష్ సినిమాతోనే ఉంటుంది అని బిగ్ అప్డేట్ ని అందించారు. దీనితో సినీ వర్గాల్లో ప్రభాస్ పాన్ వరల్డ్ ఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి అయితే ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పై అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.