బిగ్ అప్డేట్ : ఈ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా అనౌన్స్ కి రంగం సిద్ధం..!

యంగ్ రెబల్ స్టార్ [ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు బిగ్గెస్ట్ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. వాటిలో ప్రస్తుతం సలార్ అనే భారీ ఏక్షన్ డ్రామా షూటింగ్ లో ఉండగా హిందీ దర్శకుడు ఓంరౌత్ తో ఆదిపురుష్ అనే భారీ మైథలాజికల్ వండర్ ని కూడా చేస్తున్నాడు.

అయితే ఈ చిత్రం షూటింగ్ అయ్యి రిలీజ్ కి కూడా సిద్ధం అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ లైనప్ లో అనేక సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో ఇంకా అనౌన్స్ అవ్వాల్సినవి ఉండగా వాటిలో కూడా ఓ సినిమాపై ఇప్పుడు సరైన క్లారిటీ వినిపిస్తుంది.

గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని గట్టి టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా అధికారిక అనౌన్సమెంట్ పై బిగ్ అప్డేట్ బయటికి రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ గా దర్శకుడు మారుతీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇప్పుడు తాను చేసిన పక్కా కమర్షియల్ రిలీజ్ అయ్యాక ఒక 10 రోజుల్లో ప్రభాస్ సినిమాపై అనౌన్సమెంట్ అధికారికంగా తమ నుంచి వస్తుంది అని కన్ఫర్మ్ చేసాడు.

అంటే మరో పది రోజుల్లో ఈ భారీ సినిమాపై అప్డేట్ రావడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ హాట్ హీరోయిన్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారే నిర్మాణం వహిస్తున్నారని టాక్ ఉంది.