బిగ్ అప్డేట్ : “బాలయ్య 108” రిలీజ్ ముహూర్తం ఖరారు.!

మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీ లీల కీలక పాత్రలో అయితే నటిస్తున్న సాలిడ్ మాస్ ఏక్షన్ చిత్రం కోసం తెలిసిందే. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ రీసెంట్ గానే రెండు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయగా వాటికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇక మరో పక్క అయితే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి ఇపుడు మేకర్స్ మరో భారీ అప్డేట్ ని అయితే అందించారు. ఈ సినిమా రిలీజ్ ని అయితే కన్ఫర్మ్ చేస్తూ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇందులో ఎలాంటి డేట్ ని అనౌన్స్ చేయలేదు కానీ దసరా కానుకగా ఈ సినిమా వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా ఇదే రేస్ లో బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం రామ్ పోతినేని నటిస్తున్న సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే.

దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లు రెండూ బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కానున్నాయి అని చెప్పాలి. aఅంతే కాకుండా మాస్ మహారాజ్ పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు మరియు విజయ్ లియో లు కూడా ఈ రేస్ లో ఉన్నాయి. కాగా ఈ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.