లేటెస్ట్ : స్టన్నింగ్ పోస్టర్ తో “ఆదిపురుష్” ట్రైలర్ డేట్ వచ్చేసింది.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంతా జపం చేస్తున్న ఏకైక సినిమా పేరు “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మెయిన్ గా శ్రీరాముని పాత్రలో తాను నటించిన సినిమా ఇది కావడంతో భారీ స్థాయి హైప్ ఈ చిత్రం తెచ్చుకుంది. మరి ఈ చిత్రంలో అగ్ర తారాగణం సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సోనాల్ చౌహన్ లాటి స్టార్స్ ఈ చిత్రంలో ఉండగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

అయితే గతంలోనే ఈ సినిమాపై సెన్సేషనల్ హైప్ ఉండగా టీజర్ తర్వాత అంతా తారు మారు అయిపోయింది. కానీ తర్వాత కాస్త వర్క్ మెరుగు చేసాక అందరిలో నమ్మకం వచ్చింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ కోసం అవైటెడ్ గా అంతా ఎంతో ఆసక్తిగా గత కొన్నాళ్ల నుంచి ఎదురు చూస్తుండగా ఈ మే 9న అయితే ఈ ట్రైలర్ వస్తుంది అని ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ కాగా ఇప్పుడు ఈ డేట్ ని చిత్ర యూనిట్ అధికారిక అప్డేట్ తో కన్ఫర్మ్ చేసారు.

ప్రభాస్ పై ఓ పవర్ ఫుల్ అండ్ స్టన్నింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే థియేటర్స్ సహా ఆన్లైన్ లో కూడా ఒకే రోజున చేస్తారు అని స్ట్రాంగ్ బజ్ ఉంది. మరి ఆ టైం కూడా ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది.

కాగా ఈ మాసివ్ విజువల్ వండర్ ని ఈ జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషలు సహా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. 3డి, 4డి ఎక్స్ సహా 2డి ఫార్మాట్ లలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు మొత్తం థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.