లేటెస్ట్ : “గుంటూరు కారం” మొదటి సాంగ్ పై బిగ్ క్లారిటీ 

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు నటిస్తున్న క్రేజీ మాస్ చిత్రమే “గుంటూరు కారం”. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది కాగా వీరి కాంబినేషన్ లో అయితే ముచ్చటగా మూడో సినిమాగా ఇది రాబోతుంది.

ఇక ఈ భారీ చిత్రం నుంచి నిన్ననే ఊహించని విధంగా ఫస్ట్ సాంగ్ లీక్ వార్త ఐతే అందరికీ ఒకసారిగా షాకింగ్ గా మారగా అసలు సినిమా యూనిట్ ఏం జాగ్రత్తగా ఉంటుంది అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక మరో పక్క అయితే ఆల్రెడీ సినిమా సాంగ్ రిలీజ్ ని ఈ నవంబర్ లోనే రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేసిన నిర్మాత నాగవంశీ అయితే లేటెస్ట్ గా పెట్టిన నయా పోస్ట్ గుంటూరు కారం సాంగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరటనిచ్చింది.

మరి ఇందులో అయితే తాను జస్ట్ 7 అని పెట్టాడు. దీనితో తాము చెప్పినట్టుగానే మొదటి వారంలోనే గుంటూరు కారం సాంగ్ వచ్చేస్తున్నట్టుగా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ అప్డేట్ తోనే లీక్ అయ్యింది అనేది కూడా చాలా మంది మర్చిపోయారు. 

మరి మొత్తానికి ఇక మిగతా అంతా సంగీత దర్శకుడు థమన్ చేతిలోనే ఉందని చెప్పాలి. ఆల్రెడీ సర్కారు వారి పాట విషయంలో ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ గా ఉన్నారు. మరి ఈ సినిమా అయినా వారికి ఫుల్ మీల్స్ పెడుతుందో లేదో చూడాలి. 
https://x.com/vamsi84/status/1720675364308181257?s=20