Lasya – Manjunath: బూజు కర్ర చేతపట్టి.. భర్తతో కలిసి కళావతి పాటకు డాన్స్ చేసిన లాస్య…!

Lasya – Manjunath: లాస్య మంజునాథ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా పరిచయమైన లాస్య ఆ తర్వాత బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైన ఈమె ప్రస్తుతం పలు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇక పలు కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్న లాస్య సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ దానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన తండ్రి కోసం ఓ అందమైన ఇంటిని నిర్మిస్తున్నట్లు లాస్య తన తండ్రి కోసం కట్టించే ఇంటిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించారు. ఇకపోతే లాస్య సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రం నుంచి విడుదల చేసిన కళావతి అనే పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ పాటకు మహేష్ బాబు వేసిన హుక్ స్టెప్స్ వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈక్రమంలోనే లాస్య మంజునాథ్ కూడా కళావతి పాటకు తమదైన శైలిలో డాన్స్ వేశారు. ఇక మంజునాథ్ కింద ఫ్లోర్ శుభ్రం చేస్తే డాన్స్ చేయగా లాస్య బూజు కర్ర చేతిలో పట్టుకుని డాన్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ పాటకు సంబంధించిన ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నటి పూర్ణ , ప్రియమణి స్పందిస్తూ తన డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రశంసలు కురిపించారు. బూజు కర్ర చేతిలో పట్టుకుని లాస్య చేసిన ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.