యూఎస్ లో “కబ్జా” కి లాస్ట్ మినిట్ దెబ్బ.!

పాన్ ఇండియా సినిమా దగ్గర సత్తా చాటుతున్న సౌత్ ఇండస్ట్రీ లలో కన్నడ పరిశ్రమ కూడా ఒకటి. కేజీఎఫ్ కాంతారా లాంటి రెండు సెన్సేషనల్ హిట్ ల తర్వాత ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ సినిమా “కబ్జా”. ఉపేంద్ర హీరోగా శ్రేయ హీరోయిన్ గా దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించిన ఈ గ్రాండ్ యాక్షన్ డ్రామా టీజర్ తో ఆసక్తి రేపింది.

అలాగే రీసెంట్ గా ట్రైలర్ తో కూడా ఆకట్టుకోగా అంతా ఇక థియేట్రికల్ రెస్పాన్స్ కోసం చూస్తున్నారు. కాగా రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి కూడా యూఎస్ లో లాస్ట్ మినిట్ దెబ్బలు తప్పలేదని తెలుస్తుంది. షూటింగ్ ఇతర పనులు ఎప్పుడో పూర్తి అయ్యినప్పటికీ సినిమా కంటెంట్ ని మేకర్స్ ప్రీమియర్స్ కి పంపుకోలేకపోయారట. దీనితో ఈ చిత్రానికి చివరి నిమిషంలో ప్రీమియర్స్ నిలిచిపోయినట్టు తెలుస్తుంది.

దీనితో నార్మల్ రిలీజ్ లోనే ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని నమోదు చేస్తుందో కూడా చూడాలి. ఇక ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కూడా ఓ ముఖ్య పాత్ర చేయగా కేజీఎఫ్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందించాడు. అలాగే హై వాల్యూ ప్రొడక్షన్ తో నిర్మాతలు ఈ సినిమాని నిర్మాణం వహించారు. ఈ సినిమా ఓపెనింగ్స్ పాన్ ఇండియా లెవెల్లో ఎలా ఉంటాయో చూడాలి.