జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని ప్రస్తుతం ఇతర కామెడీ షోలతో బిజీగా ఉన్న ఆర్టిస్ట్ లలో కిరాక్ ఆర్పీ ఒకరు. కిరాక్ ఆర్పీకి నటుడిగా కూడా మంచి గుర్తింపు ఉండగా జబర్దస్త్ షోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆర్పీ వార్తల్లో నిలుస్తున్నారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ హరిత తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో నన్ను ఆరా అని పిలుస్తారని ఆమె తెలిపారు. హరిత పేరుతో చాలామంది ఉండటంతో ఆరా అని పేరు పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. తల్లిలాంటి మల్లెమాల గురించి నెగిటివ్ గా కామెంట్లు చేయడం బాధాకరం అని ఆమె చెప్పుకొచ్చారు. కిరాక్ ఆర్పీ అనే పేరు మల్లెమాల వాళ్లు పెట్టిందని హరిత తెలిపారు. కిరాక్ ఆర్పీ అని కాకుండా క్రాక్ ఆర్పీ అని పేరు పెట్టి ఉంటే బాగుండేదని హరిత చెప్పుకొచ్చారు.
ఆయన చెప్పిన విషయాలన్నీ తప్పు అని ఆమె పేర్కొన్నారు. జబర్దస్త్ లో ఫుడ్ తింటామని ఆ ఫుడ్ బాగానే ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. బయట ఉండేవాళ్లకు ఆకలి విలువ తెలుస్తుందని హరిత అన్నారు. ఇంట్లో ఎప్పుడు తప్పు జరగదా అని ఆమె ప్రశ్నించారు. 100 మంది వచ్చే చోటుకు 200 మంది వస్తారని వాళ్లకు కూడా సంస్థ భోజనం పెట్టాలని ఆమె వెల్లడించారు.
ఏ సంస్థకు అయినా కొన్ని రూల్స్ ఉంటాయని హరిత అన్నారు. మల్లెమాలకు అతనంటే అతను వచ్చాడని ఎవరి దగ్గరకు ఎవరు వెళ్లారని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్పీని జబర్దస్త్ లోనే నేను చూశానని ఆమె పేర్కొన్నారు. ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చారని హరిత అన్నారు. ఆర్పీ వెనుక నాగబాబు ఉంటారని నేను అనుకోనని ఆమె తెలిపారు. మితిమీరిన అభిమానం మంచిది కాదని హరిత కామెంట్లు చేశారు.