Sukumar: పుష్ప పార్ట్ 2లో ఆ పాత్ర కోసం మొదలు పెట్టిన కుమార్!

Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.బాహుబలి రేంజ్ లో ఈ సినిమా పాన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా 100 కోట్లను రాబట్టింది. ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప చిత్ర బృందం త్వరలోనే పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టాలని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణలో ఏ మాత్రం ఆలస్యం జరగకుండా శరవేగంగా షూటింగ్ పనులను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మొదటి సినిమా ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో రెండవ పార్ట్ చిత్రీకరణలో భాగంగా ఎక్కువగా నార్త్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఇండియా లోనే షూటింగ్ పనులను ప్రారంభించాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండవ పార్ట్ షూటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాని నిర్మించనున్నారు.అదే విధంగా మరొక బాలీవుడ్ స్టార్ హీరోతో ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయించాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కోసం డైరెక్టర్ వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఇక మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ గా కనిపించగా రెండవ పార్టీలో స్మగ్లర్ కి పెద్దగా అల్లు అర్జున్ కనిపిస్తున్నట్లు సమాచారం. ఇక పార్ట్ 2 లో కూడా మరొక ఐటం సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. మొదటి పార్ట్ ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో రెండవ పార్ట్ పై సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిత్రాన్ని త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.