ప్రభాస్ తో రిలేషన్ షిప్ పై అసలు క్లారిటీ ఇచ్చిన కృతి.!

టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా సినిమా దగ్గర ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో అయితే అటు హిందీ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ ఉండగా ఇక్కడ తెలుగు నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు ఉన్నారు అలా ఉండిపోయారు. అయితే సల్మాన్ విషయం ఏమో కానీ ప్రభాస్ ఇంట్లో మాత్రం తాను పెళ్లి చేసుకొని తీరాలి అని అనే కండిషన్ ఉండగానే ఉంది.

అయితే ఇదిలా ఉండగా ప్రభాస్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ లు రిలేషన్ లో ఉన్నట్టుగా ఆ మధ్య అంతా ఎంత పెద్ద హంగామా అయ్యిందో తెలిసిందే. కాగా దీనిపై ప్రభాస్ టీం వెంటనే స్పందించి కూడా విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అలాగే కృతి కూడా అప్పుడు అలాంటిది ఏమి లేదని చెప్పింది.

కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియాలో అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఆమె పంచుకుంది. అసలు ఇదంతా చేసింది వరుణ్ ధావన్ అని అతనే ఆరోజు షో లో ఎందుకు అలా చెప్పాడో కూడా అర్ధం కాలేదని చెప్పింది. ఈ విషయాన్ని ప్రభాస్ కి కూడా చెప్పానని తాను కూడా ఇదే రియాక్షన్ ఇచ్చాడని వరుణ్ ఎందుకు అలా చెప్పాడు అంటూ అన్నాడని తెలిపింది.

అయితే కృతి మరియు వరుణ్ ధావన్ లు మంచి ఫ్రెండ్స్ కాగా జస్ట్ ఫ్రెండ్షిప్ కొద్దీ ఆమెని తాను అలా ఇరికించాడట. దీనితో ఇది కాస్త పెద్ద సెన్సేషన్ గా మారింది. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ మరియు కృతి సనన్ లు నటించిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “ఆదిపురుష్” కోసం తెలిసిందే. ఈ సినిమాని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఈ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా మాసివ్ రిలీజ్ కానుంది.