Home News బాయ్ ఫ్రెండ్‌తో బ్రూస్ లీ హీరోయిన్ డేటింగ్.. పెళ్లెప్పుడో క్లారిటీ ఇచ్చిన కృతి

బాయ్ ఫ్రెండ్‌తో బ్రూస్ లీ హీరోయిన్ డేటింగ్.. పెళ్లెప్పుడో క్లారిటీ ఇచ్చిన కృతి

ఈ ఏడాది సెల‌బ్రిటీలు బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఓ ఇంటి వార‌వుతున్నారు. హీరోలు నితిన్, రానా, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ వంటి సెల‌బ్రిటీలు ఏడ‌డుగులు వేయ‌గా, డిసెంబ‌ర్ 7న నిహారిక వివాహం చేసుకోనుంది. మ‌రి కొద్ది మంది స్టార్స్ కూడా పెళ్లి పీట‌లు ఎక్కేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. బ్రూస్ లీ , `తీన్‌మార్`, `ఒంగోలు గిత్త` వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన హీరోయిన్ కృతి కర్బందా కూడా మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్ళి పీట‌లెక్కేందుకు సిద్ద‌మైంది.

Kriti Pulk | Telugu Rajyam

తెలుగు, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న కృతి క‌ర్భందాకు స‌రైన హిట్స్ లేక‌పోవ‌డంతో ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. గ‌ట్టిగానే కృషి చేస్తున్న‌ప్ప‌టికీ, ఈ అమ్మ‌డికి అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. అయితే ఈ మ‌ధ్య కెరీర్‌ని కాస్త ప‌క్క‌న పెట్టిన కృతి క‌ర్భందా బాలీవుడ్ న‌టుడు పుల‌కిత్ సామ్రాట్‌తో ప్రేమాయ‌ణం న‌డిపింది. వీరిద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోనున్నార‌ని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ నేప‌థ్యంలో కృతి స్పందించింది.

మీడియాలో వ‌స్తున్న వార్త‌లు వాస్త‌వం. పుల‌కిత్ మంచి వ్య‌క్తి. ఇద్ద‌రి అభిప్రాయాలు క‌లిసాయి. అందుకే మంచి రిలేష‌న్ కుదిరింది. ఏడాదిన్న‌ర నుండి ఇద్ద‌రం స‌హ‌జీవ‌నం చేస్తున్నాం. పెళ్లి గురించి ఇప్ప‌డే ఆలోచ‌న చేయ‌డం లేదు. కెరీర్‌పై ఫోక‌స్ పెట్టాం. మంచిగా స‌క్సెస్ అయ్యాక పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తున్నాం అంటూ కృతి చెప్పుకొచ్చింది. మొత్తానికి ఏదో ఒక మంచి ఘ‌డియ‌లో వీరిద్ద‌రు పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయం కావ‌డంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు

 

- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

అమ్మ బాబోయ్ ఆ పనులు కూడా మొదలెట్టేసింది.. వంటలక్క మామూల్ది కాదు!!

కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్.. వంటలక్క అలియాస్ దీప పాత్రను అద్భుతంగా పోషిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదేమో. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారో...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News