Krithi Shetty: భారీ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ… ఏకంగా పాన్ ఇండియా స్టార్‌తో అవకాశం!

Krithi Shetty: కేవలం ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ల జాబితాలోకి చేరిపోయారు కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో తనదైన లుక్స్‌తో అట్రాక్ట్ చేసిన కృతి శెట్టి.. ఆ తర్వాత ‘బంగార్రాజు’ సినిమాతో మాయ చేసింది. దీంతో ఊహించని రీతిలో ఆమె పాపులర్ అయింది. దీంతో దర్శకనిర్మాతల చూపు ఈ బ్యూటీపై పడింది. ఇంకేముంది ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ది వారియర్, మాచర్ల నియోజక వర్గం సినిమాలు చేస్తుండగా, సూర్య – బాల కాంబినేషన్లో రూపొందే ఓ సినిమాలోనూ రెండో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందట.

ఇకపోతే వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్.. ఇటీవలే ‘రాధే శ్యామ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అన్నుకున్నంత స్థాయిలో భారీ అంచనాలను రీచ్ కాలేకపోయినా ఓ రేంజ్‌లో మాత్రం ఓ ఊపు ఊపేస్తుందనే చెప్పాలి. ఇక రాధే శ్యామ్ విడుదల కావడంతో తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టిన ప్రభాస్. మారుతి డైరెక్షన్‌లో రానున్న ‘రాజా డీలక్స్’ సినిమాలో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒక్క స్టార్‌ హీరోకు కూడా డైరెక్ట్ చేయని మారుతీకి ఈ సారి ప్రభాస్‌ ఛాన్స్ ఇవ్వడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. పైగా అది మారుతి మార్క్ ఉన్న కామెడీ సినిమా అని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ పేరు ‘రాజా డీలక్స్’ అంటూ టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే శ్రీలీల, మాళవిక మోహనన్‌ను హీరోయిన్లుగా సెలక్ట్ చేసినట్టు సమాచారం. అయితే మూడో హీరోయిన్‌గా కృతి శెట్టి ఫైనల్ అయ్యిందంటూ ఫిల్మ్ సర్కి్ల్లో టాక్. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న బేబమ్మ.. ఏకంగా పాన్ ఇండియా స్టార్‌తోనే సినిమా ఛాన్స్ కొట్టేసింది అంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు