Rebel Star:రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వంగా ప్రస్తుతం వారి ఇంటి నుంచి ప్రభాస్ మాత్రమే ఉన్నారు.ఇప్పుడు కృష్ణంరాజు వారసత్వాన్ని వారి కుమార్తె అయిన ప్రశీద కూడా కొనసాగించనున్నారు.రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక సొంత బ్యానర్ నిర్మించి దానిపై కొన్ని సినిమాలు కూడా తీశారు. బ్యానర్ పేరు గోపికృష్ణ గా పెట్టుకున్నారు.చాలా రోజుల తర్వాత రాధేశ్యాం చిత్రం ద్వారా గోపికృష్ణ బ్యానర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ బ్యానర్ కి తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి రెబల్ స్టార్ కృష్ణం రాజు కుమార్తె ప్రశీద ఎంతగానో కృషి చేశారు.రాధేశ్యాం తర్వాత గోపికృష్ణ బ్యానర్లో వరుస సినిమాలు నిర్మించాలని ప్రశీద భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రశీద ఓ ప్రముఖ ఓటీటీ వెబ్ సిరిస్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. గోపికృష్ణ బ్యానర్లో అటు పెద్ద సినిమాలతో పాటు చిన్నచిన్న కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశీద భావిస్తున్నారు.ప్రశీద ఆలోచనల వెనుక కృష్ణం రాజుతో పాటు ప్రభాస్ కూడా ఉన్నారు.ప్రశీద సాహో చిత్రానికి కొన్నాళ్ళు పనిచేశారు.తర్వాత లండన్ లో మాస్టర్స్ చేశారు. దిని తర్వాత ముంబాయిలో ఒక సినిమాకి పని చేశారు.అమెరికాలో ప్రొడక్షన్ కోర్స్ చేశారు.తర్వాత అక్కడ నెట్ ఫ్లిక్ష్ లో ఓ వెబ్ సిరిస్ ఎక్సక్యుటీవ్ ప్రొడ్యుసర్ గా చేశారు.
నిర్మాణంలో పూర్తి స్థాయి అనుభవం వచ్చిన తర్వాతే ఇప్పుడు గోపికృష్ణ బ్యానర్ లో సినిమాలు, వెబ్ కంటెంట్ క్రియేట్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు.మొత్తానికి ప్రశీద కారణంగా గోపి కృష్ణ బ్యానర్ లో తిరిగి సినిమాలు నిర్మిస్తున్నారు.