క్రాక్ డిజిటల్ రైట్స్.. గట్టిగానే లాగారు

raviteja interview about krack movie

టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ చాలా రోజుల తరువాత మాస్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హడావుడి గట్టిగానే చేస్తున్నాడు. క్రాక్ సినిమా విడుదలై వారం దాటినా కలెక్షన్స్ డోస్ ఏ మాత్రం తగ్గలేదు. రోజురోజుకు షేర్స్ పెరుగుతూనే ఉన్నాయి. రవితేజతో సినిమా చేయడమే రిస్క్ అనుకున్న తరుణంలో నమ్మకంతో నిర్మించిన నిర్మాతలకు రవితేజ భారీ స్థాయిలో లాభాలను అందిస్తున్నాడు.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి 40% శాతానికి పైగా లాభాలను అంధించినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ ను మొదట్లోనే బ్రేక్ చేసిన క్రాక్ డిజిటల్ రైట్స్ లలో కూడా నిర్మాతకు మంచి లాభాలనే అందించింది. సినిమాకు సంబంధించిన దిజిటల్ రైట్స్ ఎంత అనే విషయంలో గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

అయితే ఆహా యాప్ కోసం నిర్మాత అల్లు అరవింద్ దాదాపు 8కోట్లకు పైగా డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమా డిజిటల్ హక్కులపై పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదట. కుదిరితే డైరెక్ట్ గా ఆహా యాప్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. అల్లు అరవింద్ నిర్మాతలతో మాట్లాడి సెటిల్ చేయాలని అనుకున్నారట. కానీ దర్శకుడు హీరో నిర్మాతతో మాట్లాడి థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు వెయిట్ చేయించారు.