క్రాక్ హిందీ రీమేక్ రైట్స్.. డిమాండ్ మామూలుగా లేదు

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ డైలీ కోటికి తక్కువ రావడం లేదు. ఇక రానున్న రోజుల్లో థియేటర్స్ సంఖ్య కూడా మరింత పెరగనుంది. ఇప్పటికే 4కోట్ల వరకు ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు సమాచారం.
ఇక థియేటర్స్ సంఖ్య పెరిగితే వచ్చేవన్ని కూడా లాభాలే.

అయితే లాక్ డౌన్ తరువాత భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న సినిమా కావడంతో ఒక్కసారిగా ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ లో అయితే కొంతమంది బడా నిర్మాతలు క్రాక్ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆఫర్స్ ఎక్కువవ్వడంతో రీమేక్ రైట్స్ ధర కూడా పెరిగినట్లు సమాచారం.

దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా కథను ఒంగోలు ప్రాంతానికి సంబంధించిన కొన్ని నిజ జీవితం ఘటనల ఆధారంగా రాసుకున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వెండితెరపై స్టోరీ క్లిక్కవ్వడంతో బాలీవుడ్ లో కూడా ఈ కమర్షియల్ మాస్ సినిమా తప్పకుండా క్లిక్కవుతుందని కొందరు బలంగా నమ్ముతున్నారు. మరి ఏ హీరో ఈ సినిమాను రీమేక్ చేస్తారో చూడాలి.