ఎన్టీఆర్ 30 సినిమా కోసం అలనాటి లేడి సూపర్ స్టార్ ని రంగంలోకి దింపిన కొరటాల శివ…?

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేయనున్నాడు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తన సినిమా మీద జాగ్రత్తలు తీసుకొని కథలో మార్పులు చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తొందర్లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే జగపతిబాబుని ప్రతి కథ నాయకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలోని ఒక లేడీ పవర్ఫుల్ పాత్ర కోసం కొరటాల శివ ఇటీవల విజయశాంతిని సంప్రదించినట్లు సమాచారం. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి అలనాటి లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన విజయశాంతి చాలా కాలంగా రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ సినిమాలకు దూరంగా ఉంది. కాగా ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలక పాత్రలో నటించింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ఈ సినిమాలో తన పాత్ర నచ్చటం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విజయశాంతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర నచ్చి సినిమా చేయటానికి అంగీకరించానని, ఇకపై ఇలాంటి పాత్రలు తనకి రావటం కష్టమని వెల్లడించింది. అందువల్ల భవిష్యత్తులో ఇకపై సినిమాలో చేయనని కూడా వెల్లడించింది.

అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ పాత్ర కోసం కొరటాల శివ విజయశాంతిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక సినిమాలలో నటించిన విజయశాంతి కొరటాల శివ దర్శకత్వంలో జరిగే ఎక్కుతున్న ఈ సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి ఇంకా ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే చాలమంది పేర్లు వినిపించాయి. ఇక తాజాగా సీతారామం సినిమా ద్వారా హిట్ అందుకున్న మృనాల్ ఠాకూర్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ఇలా ఎన్టీఆర్ సినిమా తరచూ వాయిదా పడుతూ ఉండటంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.