ఎన్టీఆర్ కోసం కొరటాల తగ్గేదేలే..!

another-trouble-for-ntr-koratalas-movie

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ హైప్ తో ఉన్న తాజా చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా ఎన్టీఆర్ అయితే అయితే తన కెరీర్ లో 30వ సినిమాని దర్శకుడు కొరటాల శివ చాలా కసితో ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయితే ఆచార్య తర్వాత అదెంత ప్లాప్ అయ్యిందో ఈ సినిమాకి గాను అంతకు మించి భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు.

అందుకే ఎక్కడా తగ్గకుండా గట్టి ప్లానింగ్ లు చేస్తున్న కొరటాల అయితే ఈ సినిమా కోసం మరో క్రేజీ ప్లానింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని ఆల్రెడీ వాటర్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అందుకు తగ్గట్టుగా భారీ ఏక్షన్ సీక్వెన్స్ లు కూడా ఈ సినిమాలో ఉండనున్నాయని తెలిసిందే. అందుకోసం కొరటాల అయితే ఏకంగా హాలీవుడ్ లెవెల్ ప్లానింగ్ చేస్తున్నారట.

హాలీవుడ్ నుంచి పలు సీన్స్ కోసం అయితే తాను హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ ని అయితే తీసుకున్నాడట. మొత్తానికి అయితే ఎన్టీఆర్ కోసం కొరటాల ఏదో గట్టి ప్లానింగ్ నే చేస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుండగా సినిమా షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది ఉగాది కానుకగా రిలీజ్ కానుంది.