ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్లకు పాతిక కోట్లు వెనక్కి తిరిగి ఇచ్చిన కొరటాల?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ అంటేనే అపజయం ఎరుగని దర్శకుడు అని చెబుతారు. ఇలా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం ఎదుర్కోలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా తన ప్రస్థానం కొనసాగించిన కొరటాల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. ఇలా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా అనంతరం కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు, భరత్ అనే నేను,జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ విధంగా ఇద్దరు మెగా హీరోలు ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా గత నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మెగాస్టార్ సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ఈ సినిమా కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ విధంగా ఈ సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకోవడంతో సినిమా కలెక్షన్ల పై భారీ నష్టం ఏర్పడింది. ఇలా మొత్తానికి ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం ఎదుర్కోవడమే కాకుండా కొరటాల కెరీర్ లో మొదటి పరాజయంగా ఆచార్య సినిమా నిలబడిందని చెప్పాలి. ఈ విధంగా ఆచార్య సినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో నష్టాలు రావడంతో వారిని ఆదుకోవడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకు వచ్చారు. అదేవిధంగా కొరటాల శివ కూడా ఈ సినిమాతో నష్టపోయిన వారికి పాతిక కోట్లు వెనక్కి తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.