క్రేజీ – “NTR30” స్టోరీ లైన్ రివీల్ చేసేసిన కొరటాల.!

koratala-siva11657085653

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ హైప్ ఉన్న పలు చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 కూడా ఒకటి. కాగా ఈ భారీ సినిమా ని దర్శకుడు కొరటాల శివ అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా గత కొన్నాళ్ల నుంచి సినిమా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు మేకర్స్ అయితే సమాధానం అందించారు.

కాగా ఈరోజు అనేక మంది పెద్ద తలల సమక్షంలో ఈ సినిమా ముహూర్తం పనులు అయితే జరిగాయి. మరి వేడుకలో దర్శకుడు కొరటాల శివ అసలు ఈ సినిమా నేపథ్యం ఏంటి అనేది రివీల్ చేసేయడం విశేషం. కాగా ఇది వరకే సినిమా అనౌన్సమెంట్ టీజర్ వీడియో లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అందరికీ బాగా గుర్తు.

మరి దీని తోనే సినిమా కథని కొరటాల చెప్తూ ఇది ఒక పీరియాడిక్ సబ్జెక్టు గా తెలిపారు. అలాగే ఒక కోస్టల్ ప్రాంతంలో నివసించే కొన్ని మృగాలు దేవుళ్ళు కానీ మనుషులు అంటే గాని ఎలాంటి భయం లేని వాళ్ళని భయపెట్టే వాడి కథే ఇది అంటూ తెలిపారు.

అంతే కాకుండా ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ మరియు భారీ గ్రాఫిక్స్ కూడా ఉంటాయని తెలిపారు. అలాగే ఈ సినిమా నా కెరీర్ లోనే బెస్ట్ వర్క్ గా ఇది నిలిచిపోతుంది అని కొరటాల అయితే తెలిపారు. కాగా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు అయితే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.