కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ఎంత పెద్ద డిజాస్టర్ రిజల్ట్ చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.! చిరంజీవి కెరీర్‌లోనే కాదు, రామ్ చరణ్ కెరీర్‌లో కూడా అది అతి పెద్ద డిజాస్టర్.
‘ఆచార్య’ డిజాస్టర్ వెనుక అర్థం పర్థం లేని కథ, కథనాలే కాదు.. చెత్త వీఎఫ్ఎక్స్ కూడా కీలక భూమిక పోషించాయి. అందుకేనేమో, ‘ఎన్టీయార్3)’ విషయంలో అటు కొరటాల శివ, ఇటు ఎన్టీయార్.. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘వీఎఫ్ఎక్స్’ కోసమే పెద్దయెత్తున బడ్జెట్‌ని కేటాయిస్తున్నారట. అంతే కాదు, వీఎఫ్ఎక్స్ అవసరమైన సీన్స్‌కి సంబంధించి.. ముందుగానే నిపుణులతో అన్నీ చక్కబెట్టేస్తున్నారట.
తాజాగా, ఓ యాక్షన్ ఎపిసోడ్‌కి సంబంధించి చిత్రీకరణ జరుగుతుండగా, అక్కడికక్కడే వీఎఫ్ఎక్స్ కూడా ప్రాథమికంగా చేయించేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం విదేశాల నుంచి సాంకేతిక నిపుణుల్ని రప్పించారట.