‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’ అక్టోబర్‌ 26 నుంచి…

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ సినిమాతో బ్లక్‌ బస్టర్‌ అందుకున్నాడు. ఇక కరణ్‌ యాంకర్‌గా చేసే కాఫీ విత్‌ కరణ్‌ షో గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఏడు సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా ఏనిమిదో సీజన్‌ కోసం రెడీ అవుతుంది.

తాజాగా ఈ సీజన్‌ సంబంధించి కరణ్‌ జోహార్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8 అక్టోబర్‌ 26 నుంచి ప్రారంభంకానున్నట్లు కరణ్‌ జోహార్‌ సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించాడు. దీనితో పాటు ఒక ప్రోమో కూడా విడుదల చేశాడు. ఇక గత సీజన్‌ లానే ఈ సీజన్‌ కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ హాట్‌స్టార్‌లో టెలికాస్ట్‌ అవ్వనుంది.