టీజర్ టాక్ : గేమ్ ఛేంజింగ్ సినిమాతో వస్తున్న కిచ్చా సుదీప్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మన తెలుగు సినిమాలతో పాటుగా కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా పలు భారీ చిత్రాలు గేమ్ ఛేంజింగ్ గా మారుతున్నాయి. అలా ఇప్పుడు ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్టే అని చెప్పాలి.

కాగా కన్నడ సినిమా దగ్గర అభినవ చక్రవర్తిగా పిలవబడే కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ టీజర్ ని పాన్ ఇండియా భాషల్లో అయితే రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రం సుదీప్ కెరీర్ లో 42వ సినిమాగా దర్శకుడు విజయ్ కార్తీక్ తెరకెక్కించిన ఈ టీజర్ చూసాక మాత్రం డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ ఇంప్రెస్ అవుతారని చెప్పొచ్చు.

కాగా ఈ టీజర్ లో విజువల్స్ గాని దర్శకుడు టేకింగ్ కూడా చాలా కొత్తగా హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. మెయిన్ గా ఆ బులెట్ షాట్స్ అలాగే మొత్తం నైట్ మోడ్ లో చూపించిన విజువల్స్ ఇంకా లాస్ట్ లో ఎలివేషన్ సహా సుదీప్ తాను మనిషిని కాదు రాక్షసుణ్ని అంటూ చెప్పిన డైలాగ్ మరింత కేజ్రీగా ఉంది.

దీనితో ఈ టీజర్ చూసాక అయితే కరెక్ట్ గా పాన్ చేస్తే పాన్ ఇండియా సినిమా దగ్గర సుదీప్ తన లాస్ట్ చిత్రం “విక్రాంత్ రోణా” తో మిస్ అయ్యిన భారీ హిట్ ని దీనితో అందుకునే లెవెల్లో ఉందని చెప్పడంలో సందేహమే లేదు. కాగా ఈ చిత్రానికి ఆల్రెడీ విక్రాంత్ రోణా సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.
K46 - Demon War Begins Telugu Promo | Baadshah Kichcha Sudeep | Vijay Kartikeyaa |B Ajaneesh Loknath