భరత్ అనే నేను సినిమాలో మెరిసిన ముద్దుగుమ్మ కియారా అద్వాణీ గుర్తుంది కదా. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయనప్పటికీ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది ఈ సుందరి. తన నాజూకైన అందంతో.. ప్రేక్షకులను మైమరిపించింది ఈ గుమ్మ.
నిజానికి కియారా.. బాలీవుడ్ లో అగ్రతార. అగ్ర హీరోల సరసన బాలీవుడ్ లో నటించి స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. లేటెస్ట్ గా అక్షయ్ తోనూ ఆడిపాడింది. లక్ష్మీ బాంబు సినిమాలో తన అందాలు ఆరబోసింది.
తన అందానికి నిజంగా ఎవరైనా పడిపోవాల్సిందే. అంత అందగత్తె అయిన కియారా ఒక్కసారి కూడా ప్రేమలో పడలేదా? కనీసం చదువుకునే రోజుల్లో అయినా.. అనే ప్రశ్న తన అభిమానులను తొలుస్తూనే ఉంది.
అయితే.. తాజాగా ఇంటర్వ్యూలో కియారా తన స్కూల్ డేస్ లో జరిగిన తన ప్రేమాయణం గురించి తన అభిమానులకు చెప్పేసింది. కాకపోతే తనది బ్రేకప్ స్టోరీ. అయినప్పటికీ.. తన ప్రేమ గురించి అభిమానులతో పంచుకుంది.
నేను ప్లస్ టూ చదువుతున్న రోజులు అవి. అప్పుడే ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. ఆ అబ్బాయినే చూస్తూ ఉండిపోయేదాన్ని. అతడంటే చచ్చేంత ఇష్టం ఉండేది. స్కూల్ కు సెలవు ఉన్నా సరే.. ఇంట్లో ఏదదో ఒక అబద్ధం చెప్పేదాన్ని. వెళ్లి అతడిని కలుసుకునేదాన్ని. నేను చదువుపై అంతగా శ్రద్ధపెట్టేదాన్ని కాదు. దీంతో నా పేరెంట్స్ నన్ను బాగా చదవాలంటూ తిట్టేవారు. నన్ను రోజూ చదువు.. చదువు అంటూ మందలించేవారు. నాకేమో ఆ అబ్బాయినే చూస్తూ ఉండాలనిపించేది. చదువు అస్సలు ఎక్కేది కాదు. దీంతో ఏం చేయాలో తెలియక… నా పేరెంట్స్ బాధను తట్టుకోలేక.. నా ప్రేమను త్యాగం చేశాను. నా ప్రేమ కన్నా.. నా తల్లిదండ్రులు, చదువు ముఖ్యమని భావించాను. అప్పుడు నేను అనుభవించిన బాధ మామూలుది కాదు. మానసికంగా ఎంతో కుంగిపోయా. కానీ.. తర్వాత వయసు పెరుగుతన్న కొద్దీ.. ఆ సంఘటనల నుంచి నెమ్మదిగా తేరుకున్నాను.. అంటూ కియారా తన తొలి ప్రేమ గురించి తన అభిమానులకు చెప్పుకొచ్చింది.