తెలుగు దర్శకుడితో KGF హీరో.. మరో పాన్ ఇండియా మూవీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ప్రాజెక్టులు ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకరి తరువాత మరొకరు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక కన్నడ నుంచి యష్ KGF ఫస్ట్ పార్ట్ తో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు. ఇక అతను కూడా ప్రభాస్. మాదిరిగానే వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టనున్నట్లు చెప్పవచ్చు.

 

ప్రస్తుతం తెలుగు దర్శకులు కూడా KGF హీరోతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్వరలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ స్టార్ హీరోతో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అయిపోయిన తరువాత పూరి యష్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

పాన్ ఇండియా తరహాలోనే యష్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబోపై ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రూమర్స్ కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక యష్ తో సినిమా చేసేందుకు మరోవైపు కోలీవుడ్ దర్శకులు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ హీరో ఏ దర్శకుడితో వర్క్ చేస్తాడో చూడాలి.