కేజీఎఫ్ రేంజ్ “కబ్జా” ట్రైలర్ కి షాకింగ్ రెస్పాన్స్.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మన సౌత్ ఇండియా సినిమాల డామినేషన్ ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ముఖ్యంగా తెలుగు మరియు కన్నడ ఇండస్ట్రీ సినిమాలు అయితే ఓ రేంజ్ లో దుమ్ము లేపుతున్నాయి. వాటిలో కేజీఎఫ్ 2 హిందీలో మైండ్ బ్లాక్ చేసింది.

దీనితో ఇదే బాటలో కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుంది అన్నట్టుగా ప్రెజెంట్ చేసిన మరో కన్నడ భారీ సినిమానే “కబ్జ”. ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర, సుదీప్ లాంటి స్టార్ హీరోలతో చేసిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ ఆ మధ్య టీజర్ తో నిజంగానే మైండ్ బ్లాక్ చేసింది.

కేజీఎఫ్ కి మరో సినిమాల ఉంది అనే టాక్ వచ్చినప్పటికీ భారీ విజువల్స్ అన్నీ కేజీఎఫ్ రేంజ్ రెస్పాన్స్ ని తలపిస్తాయని అనుకున్నారు అంతా. కానీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ విషయంలో అసలు హడావుడే లేదు. పై పెచ్చు చాలా మందికి ఈ పాన్ ఇండియా సినిమా ట్రైలర్ వస్తున్నట్టుగా కూడా తెలీదు.

ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమా ట్రైలర్ కి కన్నడ నుంచి ఇంకా 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. దీనితో అసలు చిత్ర యూనిట్ ప్లానింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొదటగా హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు కానీ మిగతా భాషల ట్రైలర్ రిలీజ్ లో చాలా మిస్టేక్ చేశారు.

దీనితో సినిమా పై ఉన్న హైప్ కూడా పోయినట్టు అయ్యింది. కానీ ట్రైలర్ అయితే బాగానే ఉందని చెప్పాలి. కానీ సినిమా టీజర్ రిలీజ్ నాటికి ఉన్న హైప్ కి తగ్గట్టుగా ఓపెనింగ్స్ వస్తాయో రావో అనేది ఆసక్తిగా మారింది. ఈ మార్చ్ 17న అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది చూడాలి మరి ఏమవుతుందో.