KGF OTT Realese: ఓటీటీలో విడుదలకు సిద్ధమైన కేజిఎఫ్ చాప్టర్ 2… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

KGF OTT Realese: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా రికార్డులు బద్దలు కొట్టింది.పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్ 2 చాప్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన వారం రోజుల అయినప్పటికీ ఏకంగా ఆరు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

హీరో యష్ అల్టిమేట్ ఎలివేషన్స్,పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నాయని చెప్పాలి.ఇలా బాక్సాఫీస్ వద్ద అత్యధిక రికార్డులను సృష్టిస్తూ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఆరు వారాలకు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ కైవసం చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయినా అమెజాన్ కేజిఎఫ్ చాప్టర్ 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల ఓటీటీ హక్కులను అత్యంత భారీ ధరకు కైవసం చేసుకుంది. ఇక ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 14వ తేదీ థియేటర్లో విడుదలయ్యింది. ఈ క్రమంలోనే ఈ సినిమాని మే నెల 27వ తేదీ నుంచి ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేటర్ లో రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమైంది.