ఒక్క హిట్టుతో భారీ రెమ్యూనరేషన్ పెంచిన కేజిఎఫ్ బ్యూటీ.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు?

ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్ అయితే చాలు వెంటనే రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తారు నేటి తరం నటిమలు. తదుపరి వారికి అవకాశాలు వస్తాయో రావో కూడా తెలియని పక్షంలో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే కేజీఎఫ్ సినిమాతో భారీ హిట్ కొట్టిన నటి శ్రీనిధి శెట్టి ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పలు సినిమా అవకాశాలను కోల్పోయినట్టు తెలుస్తుంది.

ఇకపోతే కేజిఎఫ్ చాప్టర్ 2సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తను ఏకంగా ఒక్కో సినిమాకి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు.ఈ విధంగా ఈమె రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఈమెకు ఆరు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చే శీను ఉందా అనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి.

ఇకపోతే విక్రమ్ నటిస్తున్నటువంటి కోబ్రా సినిమా కోసం శ్రీనిధి ఏకంగా ఆరు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.కోబ్రా సినిమాలో విక్రమ్ 11 విభిన్నమైన పాత్రలలో సందడి చేయగా శ్రీనిధి శెట్టి మాత్రం గ్లామరస్ పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తిగా కాగా ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.