షాకింగ్ : యష్ పుకార్లపై కేజీఎఫ్ బ్యూటీ బ్రేకింగ్ పోస్ట్.!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో కన్నడ సినిమా కూడా ఎంతలా సత్తా చాటుతుందో తెలిసిందే. మరి మన దగ్గర బాహుబలి ఫ్రాంచైజ్ ఎలాగో కన్నడ నుంచి కేజీఎఫ్ ఫ్రాంచైజ్ అంత పెద్ద హిట్ అయ్యి కన్నడ పరిశ్రమకి అపారమైన గుర్తింపు తెచ్చింది. అయ్యితే ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే హీరో రాకింగ్ స్టార్ యష్ మరియు హీరోయిన్ శ్రీనిధి శెట్టి లకు కూడా ఈ సినిమా భారీ క్రేజ్ ని తీసుకొచ్చింది.

అయితే ఈ సినిమా పరంగా యష్ మరియు శ్రీనిధి జంట అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. కానీ వీరికి సినిమా షూటింగ్ మధ్యలో ఎలా ఉండేదో ఓ డార్క్ సీక్రెట్ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ అంశం లేటెస్ట్ గా వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ టైం లో శ్రీనిధి శెట్టి యష్ తో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది అని యష్ ఆమెను వేధించేవాడు అని షాకింగ్ వార్తలు మొదలయ్యాయి.

అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ శ్రీనిధి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఓ టూల్ మాధ్యమం సోషల్ మీడియాని ఎలా వినియోగించాలో తెలుసుకోవాలని కొందరు తప్పుడు సమాచారం ఇచ్చేందుకు మాత్రమే దీనిని మిస్ యూజ్ చేస్తున్నారని కౌంటర్ ఇచ్చింది.

అంతే కాకుండా యష్ విషయంలో స్ప్రెడ్ అవుతున్న వార్త ఒక్కటి కూడా నిజం కాదని వాటిని ఎవరూ నమ్మవద్దని తెలిపింది. అంతే కాకుండా యష్ ఒక మంచి జెంటిల్మెన్, ఒక మెంటర్ తనకి మంచి ఫ్రెండ్ అని చెప్పింది. ఇంకా కేజీఎఫ్ సినిమా చేస్తున్న సమయంలో తనతో వర్క్ చేయడం ఎంతో ఎంజాయ్ చేసానని కన్ఫర్మ్ చేసింది. దీనితో ఈ ఇద్దరి విషయంలో వైరల్ గా మారిన సంచలన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెక్ పెట్టింది.