Pavan Kalyan : హరిహర వీర మల్లు లో కేజీఎఫ్ నటుడు…. కీలక పాత్రలో ఇనాయత్ ఖలీల్…!

Pavan Kalyan : పవన్ కళ్యాణ్ మొదటిసారిగా నటిస్తున్న జానపద చిత్రం హరి హర వీర మల్లు. ఇక ఈ సినిమాలో పవన్ ఒక బందిపోటు హరి హర వీర మల్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ రాజా కుమారి పాత్రలో నటిస్తోంది. నర్గీస్ ఫక్రి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

కెజియఫ్2 బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ‘కెజియఫ్’ సినిమాల్లో ఇనాయత్ ఖలీల్ పాత్రను ఓ తెలుగు నటుడు పోషించాడు. అతడి పేరు బాలకృష్ణ, ప్రశాంత్ నీల్‌కు దగ్గరి బంధువవుతాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో బాలకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తన పాత్రకు సంబంధించిన విశేషాలను తాజాగా అతడు మీడియాకు వెల్లడించాడు. బాలకృష్ణ నటించిన ఓ వెబ్ షో మస్తీస్ ను క్రిష్ చూశాడు. దీంతో ‘హరిహర వీరమల్లు’ లో ఓ పాత్రకు సంప్రదించాడు.

రాజదర్బార్‌లో మంత్రి అయిన హకీం ఖాన్ అనే పాత్రను బాలకృష్ణకు ఇచ్చాడు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓడ సెట్ వేసి అతడిపై సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌లో భాగంగా అర్జున్ రాంపాల్‌పై దాడి చేశానని బాలకృష్ణ చెప్పాడు. బాలీవుడ్ నటుడైన అర్జున్ ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రను పోషిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న సినిమా ‘’అల్లుడు వేరే లెవెల్’’ లో బాలకృష్ణ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీధర్ సీపాన తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని బాలకృష్ణ వివరించాడు.