ఆదిపురుష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కెజిఫ్ నటి

చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ నుండి టీజర్ రూపం లో అప్డేట్ వచ్చింది. కానీ అది అభిమానులను, అలాగే సినిమా ప్రియులను  తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. బాహుబలి రేంజ్ లో ఉంటుందేమో అనుకున్న ఫ్యాన్స్ చాలా డిసప్పోఇంట్ అయ్యారు.

చాలా మంది ఈ టీజర్ పూర్తిగా కార్టూన్ షో లాగా ఉందని అంటున్నారు. ఈ సినిమాని మాములుగా తీసి ఉంటే బాగుండేది. అందరికీ నచ్చేది. నాణ్యత లేని విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రేక్షకులకి నెగటివ్ ఫీలింగ్ ని తీసుకు వస్తున్నాయి.

ఈ సినిమాలో రావణుడిగా నటిస్తున్న  సైఫ్ అలీఖాన్ ఉంగరాల జుట్టు పెద్ద గడ్డంతో రావణాసురిడిలా కాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీలా ఉందని నెటిజన్లు అంటున్నారు. సైఫ్ పాత్ర పై కన్నడ నటి, బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ఇలా అంటున్నారు… రావణుడి పాత్ర ఎలా ఉంటుందో దర్శకుడికి తెలియలేదన్నారు.

ఎన్టీ రామారావుని కానీ డాక్టర్ రాజ్‌కుమార్‌ ని కానీ చూస్తే తెలుస్తుందన్నారు. లేదంటే ఎస్వీ రంగారావు చేసిన సంపూర్ణ రామాయణం సినిమా చూసినా తెలుస్తుందన్నారు. పైగా రావణుడు శివ భక్తుడు. బ్రాహ్మణుడు. 64 కళల్లో దిట్ట అన్నారు.

కానీ ఈయన మాత్రం టర్కిష్ నిరంకుశుడులా ఉన్నాడని… రావణుడు లాగ కాదు అని అన్నారు. రామాయణాన్ని, చరిత్రను బాలీవుడ్ సరైన విధానం లో చూపించడం లేదని దీనిని మనుకోమని ఆమె అన్నారు. ఎన్టీ రామారావు గురించి మీరు విన్నారా అంటూ ఆమె ట్వీట్ చేసారు.