Jersey : ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూస్ రాబట్టిన…కేజిఎఫ్ 2 దెబ్బకి అవుట్..!

Jersey : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరో గా నటించిన కేజిఎఫ్2 చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ఈ సినిమా రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా దెబ్బకి చాలా సినిమాలు గల్లంతయ్యాయి. ఇలా గల్లంతైన సినిమాలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన జెర్సీ సినిమా కూడా ఒకటి. ఈ జెర్సీ సినిమా తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాకు రీమేక్. అయితే హిందీ వర్షన్ లో కూడా ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి నే దర్శకత్వం వహించారు.

విడుదలైన తర్వాత ఈ జెర్సీ సినిమాకు మంచి ఎమోషనల్ డ్రామా గా రివ్యూస్ అందుకున్నప్పటికీ, కలెక్షన్లు మాత్రం దారుణంగా పడిపోయాయి. దీనికి కారణం కేజిఎఫ్ 2 సినిమా క్రేజ్ బాలీవుడ్ లో ఇంకా తగ్గకపోవడంమే. గతంలో సాహిత్ కపూర్ సినిమాలు 100 కోట్లు కలెక్షన్లు రాబట్టగా, ప్రస్తుతం కేజీఫ్ 2 దెబ్బకి రెండు అంకెల తో కూడిన కలెక్షన్లు సాధించడమే గగనమవుతోంది. సాహిత్ కపూర్ జెర్సీ సినిమా కంటే ముందు తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మొదటి రీమేక్ తో మంచి విజయాన్ని అందుకున్న షాహిద్ రెండో రీమేక్ తో ఆశించిన విజయాన్ని పొందలేక పోయాడు.

జెర్సీ సినిమా విడుదల అయ్యాక రివ్యూస్ మాత్రం చాలా బాగా వచ్చాయి కానీ కలెక్షన్లు రాకపోవడంతో ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కే జి ఎఫ్ 2 సినిమా క్రేజ్ కొనసాగకపోతే ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వచ్చేవి. ఒకసారి ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కారణంగా, కేజీఫ్ 2 విడుదల కారణంగా ఇలా ఐదుసార్లు జెర్సీ సినిమా ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చి చివరకు ఏప్రిల్ 22న విడుదల చేశారు. అయినప్పటికీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది.