బాలీవుడ్ అయితే ఏంటి.. మహానటి తగ్గట్లేదుగా!

Keerthy Suresh Amazing Pics

మహానటి సినిమాతో తన హావభావాలతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన క్యూట్ గర్ల్ కీర్తి సురేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Keerthy Suresh Beautiful Images

ఇప్పటికే తమిళ్ తెలుగులో తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఓకే చేయడం లేదట. అప్పట్లో అజయ్ దేవ్ గన్ ‘మైదాన్’ సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ అమ్మడు ఎందుకో ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ తరువాత డ్రాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి నార్త్ నుంచి ఆఫర్స్ చాలానే వస్తున్నాయట.

అప్పుడప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలతో కలిసి పార్టీలలో కూడా పాల్గొంటుంది. అయితే కీర్తికి నచ్చే విధంగా ఎలాంటి ఆఫర్స్ రావట్లేదట. అసలే అందాల ఆరోబోతకు చాలా దూరం ఉండే ఆమెకు ఎక్కువగా అలాంటి ఆఫర్స్ రావడం వల్లనే రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కొన్ని ఆఫర్స్ లలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు కూడా వస్తున్నాయని ఒప్పుకోవడం లేదట. బాలీవుడ్ అయినా కూడా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటుందట. మరి ఆమెకు తగ్గట్టుగా మొదటి బాలీవుడ్ ఆఫర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.