‘మామన్నన్‌’ 50 డేస్‌ సెలబ్రేషన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కీర్తి సురేశ్‌!

పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో డైరెక్టర్‌ మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన ‘మామన్నన్‌’ చిత్రంలో నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ బ్యూటీ కీర్తిసురేశ్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటించింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. తర్వాత తెలుగులో కూడా విడుదల కాగా.. సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మామన్నన్‌ మేకర్స్‌ నిర్వహించిన 50 డేస్‌ సెలబ్రేషన్స్‌లో కీర్తిసురేశ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జీబ్రాను పోలిన చారలతో డిజైన్‌ చేయబడ్డ చీరకట్టులో ఈవెంట్‌కే స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అందానికే అసూయ పుట్టేలా కనిపిస్తున్న మహానటి ట్రెడిషనల్‌ లుక్‌ నెట్టింటిని షేక్‌ చేస్తోంది.’మామన్నన్‌’ చిత్రంలో మలయాళ స్టార్‌ హీరో ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో నటించి తన యాక్టింగ్‌తో సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని రెడ్‌ జియాంట్‌ మూవీస్‌పై ఎం.షెంగబాగ్‌ మూర్తి, ఆర్‌ అర్జున్‌ దురై నిర్మించారు. ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ. ఆర్‌.రెహమాన్‌ సంగీతన్ని అందించారు.