కీర్తి సురేష్ దంపతులకు డ్రీమ్ ఐకాన్ బ్లెస్సింగ్స్.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటో!

హీరోయిన్ కీర్తి సురేష్ తన స్నేహితుడు ఆంటోనీని 15 సంవత్సరాల ప్రేమ తరువాత ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. హిందూ సంప్రదాయం,క్రిస్టియన్ సంప్రదాయాల్లో రెండుసార్లు వివాహం చేసుకున్నారు ఈ జంట. గోవాలో సింపుల్ గా వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య జరిగింది.

ముందు సాంప్రదాయ అయ్యంగార్ విధానంలో జరిగిన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో దళపతి విజయ్ నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయ్ సాంప్రదాయ పంచ కట్టు తెల్లచొక్కాలో సింపుల్ గా కనిపించాడు. కీర్తి సురేష్ కూడా అందమైన పసుపు మరియు ఆకుపచ్చ రంగు మడిసర్ ను ధరించి ఎంతో అందంగా కనిపించింది.

కీర్తి సురేష్ ఈ ఫోటోలని షేర్ చేస్తూ మా డ్రీమ్ ఐకాన్ మా డ్రీమ్ వెడ్డింగ్ లో మమ్మల్ని ఆశీర్వదించారు, విజయ్ సర్ కి ధన్యవాదాలు ప్రేమతో మీ నంబి,నంబన్ అనే ట్యాగ్ లైన్ ని జోడించింది. కీర్తి సురేష్ విజయ్ సరసన భైరవ సర్కార్ అనే రెండు సినిమాలలో నటించింది. ఇక ఈ పెళ్లికి విజయ్ త్రిష తో కలిసి ప్రైవేట్ జెట్ లో రావడం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. భార్యని పట్టించుకోకుండా త్రిషతో కలిసి తిరగడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేయిస్తున్నారు.

ఇక ఆ విషయం పక్కన పెడితే కీర్తి పెళ్లిలో విజయ్ తో పాటు నాచురల్ స్టార్ నాని, అంజన దంపతులు త్రిష, డైరెక్టర్ అట్లీ దంపతులు సందడి చేశారు. ఇక కీర్తి షేర్ చేసిన పెళ్లి ఫోటోని చూసిన ఆడియన్స్ ది మోస్ట్ అవైటెడ్ పిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలు ముగిసిన తరువాత తన బాలీవుడ్ డెబ్యూ మూవీ అయిన బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంది కీర్తి సురేష్. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది.