Keerthi Suresh: స్కిన్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కీర్తి సురేష్… డబ్బు కోసం హద్దులను చెరపనంటూ కామెంట్స్!

Keerthi Suresh: తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం నేను శైలజా. ఈ సినిమా ద్వారా తన నటన, అందంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ అనంతరం వరుస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమె పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.

కీర్తి సురేష్ మలయాళంలో నటించిన సాని కాయిదమ్‌(తెలుగులో చిన్ని)` అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మే 6న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ స్కిన్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ… తన కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షో చేసే పాత్రలు కాకుండా నటనపైనే దృష్టి సారించారు. నా అదృష్టం వల్ల మొదటి నుంచి నాకు ఈ విధమైనటువంటి పాత్రలే వస్తున్నాయి అంటూ ఈమె తెలిపారు.

ఇక నటనలో, తెరపై ఎలా కనిపించాలి అనే విషయంలో కొన్ని హద్దులున్నాయి. డబ్బు కోసం ఆ హద్దులను దాటి నటించనని కీర్తి సురేష్ ఈ సందర్భంగా స్కిన్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే సర్కారీ వారి పాట సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.