Keerthi Suresh : సీరియల్ కిల్లర్ గా రాబోతున్న మహా నటి…!

Keerthi Suresh : హీరోయిన్స్ అనగానే గ్లామర్ డాల్ ముద్ర వేస్తారు. కొంత సక్సెస్ అయ్యాకనో లేక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాకనో కథా ప్రాధాన్యమున్న పాత్రాలలో నటిస్తుంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అందుకు భిన్నంగా వాళ్లకు నచ్చిన కథలతోనే ప్రయాణం సాగిస్తుంటారు. ఆలాంటి నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే తమ పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ అభిమానుల చేత శభాష్ అనిపించుకుంటోంది.

ప్రస్తుతం కీర్తి,మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే కమర్షియల్ హీరోయిన్ గా కీర్తికి తిరుగుండదు. ఇక కీర్తి కూడా ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక కీర్తి మెగాస్టార్ చెల్లెలి గా భోళా శంకర్ లో నటిస్తోంది. ఒక వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ఆస్కారమున్న పాత్రల్లోను చేస్తోంది.

అలాంటి సినిమానే చిన్ని. తమిళ సినిమా సాని కాయిదం సినిమా డబ్బింగ్. ఈ సినిమాలో లేడీ కానిస్టేబుల్‌ జాబ్‌ చేసే ఆమె ఏకంగా సీరియల్‌ కిల్లర్‌గా మారి 24 హత్యలు చేసింది. మొత్తానికి దొరికిపోయి పోలీసులు విచారిస్తుండగా, ఆ పోలీస్‌ని కూడా చంపేస్తానంటూ బెదిరిస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. కీర్తిసురేష్‌, సెల్వరాఘవన్‌ కలిసి నటించిన ఈ చిత్రం మే 6న విడుదల చేయబోతున్నారు. సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో ఓటీటీ చిత్రంగా విడుదల కాబోతుంది. కానిస్టేబుల్‌గా పనిచేసే చిన్ని ఎందుకు సీరియల్‌ కిల్లర్‌గా మారిందనేది సస్పెన్స్ . ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్స్ చేసిన కీర్తిసురేష్‌ ఇలాంటి కిల్లర్‌ రోల్స్ చేయడం షాకిస్తోంది . ఈ చిత్రానికి అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం వహించారు.