Keerthi Suresh : మరోసారి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కీర్తి…. ఈసారి ఓటీటీ లో అలరిస్తున్న మహా నటి…!

Keerthi Suresh : ఇప్పటి తరం హీరోయిన్స్ లో విభిన్నంగా కథలను ఎంచుకుంటూ అటు గ్లామర్ పాత్రలు, ఇటు నటనకు ఆస్కారమున్న పాత్రలతో మెప్పిస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సినిమాతో నటనలో అందరి హీరోయిన్స్ కన్నా ఒక మెట్టు పైకి ఎక్కింది కీర్తి. నేషనల్ అవార్డు అందుకున్న ఈ భామ కేవలం నటన పరమైన పాత్రలే కాకుండా గ్లామర్ పాత్రాల్లోను నటిస్తోంది. ప్రస్తుతం కీర్తి మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే కమర్షియల్ హీరోయిన్ గా కూడా కీర్తి సక్సెస్ అయినట్టే.

దీనికి కారణం ఈ మధ్యలో కీర్తి కీ సరైన కమర్షియల్. హిట్ సినిమా లేదు. ఈ మధ్యే వచ్చిన గుడ్ లక్ సఖి సినిమా నిరాశపరిచింది. దీంతో కీర్తి ఆశలన్నీ ఇపుడు సర్కారు వారి పాట సినిమాపైనే ఉన్నాయి. ఇక ఇపుడు ఓటీటీ లో సందడి చేయనుంది కీర్తి. అమెజాన్ ప్రైమ్ లో రానున్న ఈ సినిమాలో కీర్తి డీ గ్లామర్ పాత్రలో నటిస్తోంది. సాని కాయిదాం అనే తమిళ సినిమాతో రానుంది ఇక ఈ సినిమాను తెలుగులో చిన్ని పేరుతో తీసుకొస్తున్నారు.

YouTube video player

“మనల్ని ఒకరు కొడితే వాళ్ళను తిరిగి కొట్టాలి… మనపై ఒకరు ఉమ్మేస్తే మనము వాళ్ళపై ఉమ్మేయాలి…. మన జీవితంతో ఆడుకుంటే మనము పగ తీర్చుకోవాలి…. “ అంటూ సాగే డైలాగ్ ద్వారా రివెంజ్ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని అర్థమవుతుంది. ఇక చివర్లో గన్ పట్టుకుని కాల్చినట్టు చూపించడం సినిమా మీద అంచనాలు పెంచుతోంది. ఇక కీర్తి నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా మే 6తేదీ నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.