ఆహాలో ప్రసారం కానున్న కార్తీ సర్దార్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ హీరో కార్తీ గురించి పరిచయం అవసరం లేదు ఈయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈయన నటించిన యుగానికి ఒక్కడు ఆవారా కాకి ఖైదీ ఊపిరి వంటి సినిమాలు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.ఇలా కార్తి నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ రావడంతో పెద్ద ఎత్తున సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా మంచి ఆదరణ సంపాదించుకోగా తాజాగా సర్దార్ సినిమా ద్వారా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దీపావళి పండుగ సందర్భంగా మిత్రన్ దర్శకత్వంలో నటించిన సర్దార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కార్తీక్ ద్విపాత్రాభినయంలో నటించి సందడి చేశారు.ఇక ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కాగా తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ సినీ బ్యానర్స్ లో అక్కినేని నాగార్జున విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా థియేటర్లో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ ఆహా భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని నవంబర్ 18 వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం చేయనున్నట్లు అధికారకంగా వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మరి డిజిటల్ మీడియాలో ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కార్తీక్ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే.