కార్తికేయ 2, కాంతార హిట్.. డివోషనల్ బాట పట్టిన యంగ్ హీరోస్?

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఆదరణ సంపాదించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో కాంతార, కార్తికేయ 2 వంటి సినిమాలు ఒకటని చెప్పవచ్చు.ఈ రెండు సినిమాలు కూడా డివోషనల్ కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఇక ఈ సినిమాలు మంచి హిట్ కావడంతో యంగ్ హీరోలు సైతం ఇలాంటి డివోషనల్ సినిమాలలో నటించడానికి ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగ సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వారాహి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు సంతోష్ జాగర్లమూడి మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకుడు మాట్లాడుతూ తమ దర్శకత్వంలో వచ్చిన సుబ్రహ్మణ్యపురం ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే మాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని వారాహి అనే టైటిల్ తో డివోషనల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈయన వెల్లడించారు. ఇక గత కొద్ది రోజుల క్రితం నిఖిల్ రిషబ్ శెట్టి హీరోలుగా నటించిన కాంతార, కార్తికేయ 2వంటి డివోషనల్ సినిమాలు ఎంతో మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తరహాలోనే మా సినిమా కూడా మంచి ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అంటూ సంతోష్ జాగర్లమూడి ఈ సందర్భంగా వారాహి సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.