కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్. హ్యాపీడేస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నిఖిల్ తరువాత కమర్షియల్ సినిమాలు అంటూ ఫన్ ఎంటర్టైనర్ కథలు చేశారు. అవి వర్క్ అవుట్ కాకపోవడంతో జోనర్ మార్చి స్వామిరారా మూవీ చేశాడు.
ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తరువాత కార్తికేయ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత కంప్లీట్ గా తన స్టైల్ మార్చేసి కంటెంట్ బేస్డ్ కథలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే నిఖిల్ సినిమాలు ప్రేక్షకాదరణ పోదుతూ వస్తున్నాయి. ఇక కార్తికేయ 2 మూవీ అయితే నిఖిల్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.
తాజాగా స్పై చిత్రంతో ప్రేక్షకుల ముందుకిని వచ్చిన నిఖిల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయితే ఈ మూవీ కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఎవెన్ అందుకొని హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకుంది. ప్రస్తుతం అతని చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. పీరియాడిక్ జోనర్ లో ది ఇండియా హౌస్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్ కలిసి నిర్మిస్తున్నారు.
స్వయంభు అనే మరో సినిమా కూడా పాన్ లెవల్ లో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై హైఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ రెండు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలు కావడం విశేషం. వీటి తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లోనే ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం విఐ ఆనంద్ ఊరు పేరు భైరవకొన అనే చిత్రాన్ని సందీప్ కిషన్ తో చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దీని తర్వాత నిఖిల్ మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో విఐ ఆనంద్ ఉన్నారని టాక్.