అమెరికాలో అలాంటి రికార్డు సృష్టించిన తొలి తెలుగు సినిమాగా కార్తికేయ 2!

సాధారణంగా కొన్ని సినిమాలు ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటాయి. మరి కొన్ని సినిమాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. అయితే సినిమా హిట్ కావాలంటే హీరో హీరోయిన్లు దర్శకనిర్మాతలు బడ్జెట్ ముఖ్యం కాదని కంటెంట్ ముఖ్యమని ఎన్నోసార్లు ఎన్నో సినిమాలు నిరూపించాయి. అలాంటి వాటిలో కార్తికేయ2 సినిమా ఒకటి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రికార్డులను సృష్టిస్తుంది.

నిఖిల్ అనుపమ జంటగా నటించిన ఈ సినిమా కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఇప్పటికి ఈ సినిమా క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది.ఇక మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా ఏకంగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

ఇదిలా ఉండగా తాజాగా అమెరికాలో ఈ సినిమా మరొక అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు గాను ఏకంగా అమెరికాలో 80 లకి పైగా ప్రదర్శితమవుతూ మరొక రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఇలాంటి రికార్డు అందుకోలేదు ఇలాంటి రికార్డ్ అందుకున్న మొదటి సినిమాగా కార్తికేయ 2రికార్డ్ సృష్టించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన అధికారిక ఖాతా ద్వారా తెలియజేశారు.