కార్తీకదీపం తర్వాత ఇప్పుడు వంటలక్క ఏం చేస్తుంది.. ఎక్కడుంది?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్స్ ద్వారా అందరికీ సుపరిచితమైన వంటలక్క ప్రేమి విశ్వనాథ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈమె తెలుగు నటి కాకపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేమి విశ్వనాథ్ కి ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వంటలక్క ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో తన పాత్రకు పులిస్టాప్ పెట్టారు. దీంతో ఈమె బుల్లితెరకు దూరమయ్యారు.

ఈ విధంగా కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత ప్రేమి విశ్వనాథ్ ఏ ఇతర సీరియల్స్ లోనూ నటించలేదు. అలాగే ప్రస్తుతం ఈమెకు వెండితెరపై అవకాశాలు వస్తున్నాయని, ఇలా సినిమాలతో వంటలక్క బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపించినప్పటికీ వీటి గురించి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఏం చేస్తుంది అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొనివుంది.

అయితే తాజాగా కార్తీకదీపం సీరియల్ నుంచి దూరమైన ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియా వేదికగా వేదికగా ఒక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎర్నాకులంలో పని చేయటానికి డ్రైవర్, అకౌంటెంట్ కావాలంటూ ఈమె జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నోటిఫికేషన్ కి మంచి ఆదరణ లభించింది.ఈ విధంగా కార్తీకదీపం సీరియల్ నుంచి దూరమైన వంటలక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, మరోవైపు వెండితెర అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.